“శ్యామ్ సింగరాయ్” నుండి తార లిరికల్ వీడియో విడుదల!

“శ్యామ్ సింగరాయ్” నుండి తార లిరికల్ వీడియో విడుదల!

Published on Dec 23, 2021 2:52 PM IST

నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి తార లిరికల్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ లిరికల్ వీడియో లో షూటింగ్ సన్నివేశాలను, హీరో నాని, హీరోయిన్ కృతి శెట్టి ల పై చిత్రీకరించిన సన్నివేశాలను చూపించడం జరిగింది. రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, అభినవ్ గోమతం తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ను డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు