కన్ఫర్మ్..ఎన్టీఆర్ ఆ సినిమా చేయట్లేదట !

22nd, June 2017 - 03:22:33 PM


ఈరోజు పొద్దు పొద్దున్నే ఎన్టీఆర్ గురించిన ఒక వార్త అందరిలోనూ తెగ ఆసక్తి రేపింది. ముఖ్యంగా ఆయన అభిమానుల్లో అయితే కొత్త ఉత్సాహాన్ని నింపేసింది. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘మహానటి’ ప్రాజెక్టులో తారక్ సీనియర్ ఎన్టీఆర్ నిజ జీవిత పాత్రను చేయనున్నారు. ఏ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఒప్పుకోవడమే ఆలస్యం అనేది ఆ వార్తల సారాంశం. ఈ వార్త విన్న చాలా మంది తాతగారి పాత్రే కాబట్టి ఎన్టీఆర్ ఖచ్చితంగా చేసేస్తారనే నిర్ణయానికి కూడా వచ్చేశారు.

కానీ ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల కథనం మేరకు ఈ వార్త ఒట్టి పుకారేనని, ఎన్టీఆర్ ఆ సినిమా చేయడం లేదని తేలిపోయింది. దీంతో ఫ్యాన్స్ లో కాస్తంత నిరుత్సాహం నెలకొన్నా విషయంపై మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అదే విధంగా మరి ఎన్టీఆర్ ఆ పాత్రను చేయకపోతే ఏ హీరో చేస్తాడనే పాత ప్రశ్న మరింత బలంగా తెరపైకొచ్చింది. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ‘జై లవ కుశ’ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.