నన్ను తలెత్తుకుని తిరిగేలా చేసిన కొరటాలశివకు ఋణపడి ఉంటాను – తారక్

ntr
‘జనతా గ్యారేజ్’ ఘన విజయం సందర్బంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అభిమానుల నడుమ జరిగిన సక్సెస్ మీట్లో హీరో తారక్ ఇచ్చిన ఎమోషనల్ స్పీఎస్ అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమం చివర్లో మైక్ తీసుకున్న తారక్ ‘మొదట రిపోర్ట్స్ వినగానే కాస్త కంగారు మొదలైంది. మీకిచ్చిన మాట ఎక్కడ తప్పవుతుందో అని భయపడ్డాను. కానీ మెల్లగా అభిమానవుల నుండి వచ్చిన రిపోర్ట్స్ వినగానే ఇంట గొప్ప విజయాన్ని మీకివ్వడానికి నాకిన్నెళ్లు పట్టిందా అనిపించింది’ అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

అలాగే ఈ విజయాన్ని తన తల్లిదండ్రులకు అంకిత్తమిస్తున్నట్టు తెలిపారు. ఇంత గొప్ప విజయం ఇచ్చి తనను, తన అభిమానులను తలెత్తుకుని తిరిగేలా చేసిన కొరటాల శివకు ఆజన్మంతం రుణపడి ఉంటానని, ఈ విజయం మా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే విజయమని, మీ అందరినీ ఆనందపెట్టడమే నా ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. తారక్ అంత ఎమోషనల్ గా మాట్లాడటంతో అభిమానులు కూడా కాత్స భావోద్వేగానికి గురయ్యారు.