బరువు తగ్గాకే షూటింగ్లో పాల్గొంటున్న తారక్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ సోనా బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో చేస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 20 నుండి మొదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన కొత్త లుక్ మేకోవర్లో బిజీగా ఉండటం వలన ఆయన మొదటి షెడ్యూల్ లో పాల్గొనలేకపోయారు. అందుకే ఈ నెల 9 నుండి మొదలైన రెండవ షెడ్యూల్లో ఈరోజు నుండి జాయిన్ అయ్యారు తారక్. ఈ చిత్రం కోసం ఆయన ఏకంగా 12 కేజీల వరకు బరువు తగ్గారట.

కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తుండగా ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాను ఫైనల్ చేయగా రెండో హీరోయిన్ గా నివేత థామస్ ను అనుకుంటున్నారట అలాగే మూడవ హీరోయిన్ గా కొత్త నటిని తీసుకునే అవకాశముంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్, హాలీవుడ్ లో పేరు మోసిన మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ వంటి ప్రముఖ టెక్నీషియన్లను పని చేస్తున్నారు.