‘జై లవ కుశ’ లో ఎన్టీఆర్ ఆ పాత్ర చేయడంలేదట !


ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రంలో అయాన్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్న సంగతి తెల్సిందే. అయితే ఆ పాత్రలు ఎలాంటివి, వాటి స్వభావం ఏమిటి అనే వివరాల్ని చిత్ర యూనిట్ ఇంతవరకు బయటపెట్టలేదు. కానీ తాజాగా ఈ మూడు పాత్రల్లో ఒకటి క్లాసికల్ డ్యాన్సర్ పాత్రని వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ అవేవీ వాస్తవం కాదని తేలిపోయింది.

చిత్ర సన్నిహిత వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం తారక్ క్లాసికల్ డ్యాన్సర్ పాత్ర చేయడంలేదని రూఢీ అయింది. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను మే 19న తారక్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేయనున్నారు. రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, చోటా. కె. నాయుడు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.