“బిగ్ బాస్” కి ధీటుగా తీసుకెళ్తున్న తారక్.!

Published on Sep 24, 2021 9:22 pm IST


ప్రస్తుతం మన తెలుగు స్మాల్ స్క్రీన్ వద్ద మంచి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తున్న గ్రాండ్ రియాలిటీ షోస్ ఏమన్నా ఉన్నాయి అంటే అవి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న “బిగ్ బాస్ సీజన్ 5” అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలే అని చెప్పాలి. అయితే వీటిలో మాత్రం ముందు నుంచి ఎక్కువ రీచ్ అండ్ రెస్పాన్స్ ఉన్న షో బిగ్ బాస్ అనే చెప్పి తీరాలి.

కానీ దానికి ధీటుగా మాత్రం ఎవరు మీలో కోటీశ్వరులు షో ని నిలబెట్టింది తారక్ అనే చెప్పడంలో ఎలాంటి సందేహం. తన హోస్టింగ్ పై బలమైన నమ్మకంతో మేకర్స్ అయ్యిన అప్రోచ్ ని టాక్ ఎక్కడా తగ్గించకపోగా తనదైన ఆ గ్రాఫ్ ని ఇప్పుడు బిగ్ బాస్ వీక్ యావరేజ్ రేటింగ్ ని మించి తీసుకెళ్తుండడం గమనార్హం.

ఇది వరకే గత మూడు వారాల్లో కూడా మంచి రేటింగ్ అనుకున్న తారక్ షో ఇప్పుడు బిగ్ బాస్ కి కాస్త వ్యత్యాసంలో ముందు ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో మాత్రం ఎక్కువ క్రెడిట్ తారక్ హోస్టింగ్ కే వెళుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :