రాజమౌళి, కొరటాలతో సూపర్ ఎంటర్టైనింగ్ గా తారక్.!

Published on Sep 17, 2021 8:01 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న సూపర్ హిట్ స్మాల్ స్క్రీన్ ఎంటర్టైనర్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”. వారం వారంకి గ్రాఫ్ ని పెంచుకుంటూ వస్తున్న ఈ గ్రాండ్ రియాలిటీ షోలో హీటెక్కించే ప్రశ్నలతోనే పాటుగా అలరించే ఎంటర్టైన్మెంట్ కూడా గట్టిగా ఉంటుంది.. మరి ఈ షోకి అప్పుడప్పుడు పలువురు సినీ తారలు ప్రత్యేక అతిధులుగా వస్తారన్న సంగతి తెలిసిందే.

అలా ఈసారి మన టాలీవుడ్ టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి, కొరటాల శివలు హాజరయ్యారు. రాబోయే కొత్త ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ మాత్రం వేరే లెవెల్లో ఉండేలా ఉందని ఈ సరికొత్త ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. ఈ ఇద్దరికీ కూడా తారక్ ఎంత ఆప్తుడో తెలుసు.. మరి అంత మంచి బాండింగ్ ఉన్నవారితో ఈ కొత్త ఎపిసోడ్ అన్నది డెఫినెట్ గా హిట్ అనే ఫిక్స్ అవ్వొచ్చు అందుకు తగ్గట్టుగానే ఈ ప్రోమో ఉంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే సెప్టెంబర్ 20 వరకు ఆగాల్సిందే..

సంబంధిత సమాచారం :