ఈసారి తారక్ సిక్స్ ప్యాక్లో కనిపిస్తారా ?

31st, December 2017 - 05:44:18 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేయనున్న సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఈ లుక్ కేవలం హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ పరంగానే కాకుండా ఫిజిక్ పరంగా కూడా కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. తారక్ త్రివిక్రమ్ సినిమాలో చాలా స్లిమ్ గా కనిపిస్తారట.

ఇందుకోసం ఆయన ప్రముఖ ఫిజికల్ ట్రైనర్ లోయ్డ్ స్టీవెన్స్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. స్టీవెన్స్ గతంలో బాలీవుడ్ స్టార్ హీరోలైన హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ వంటి వాళ్లకు ఫిజికల్ ట్రైనర్ గా పనిచేశారు. కాబట్టి ఆయన వద్ద శిక్షణ తీసుకుంటున్న ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమాలో సిక్స్ ప్యాక్లో కనిపించే అవకాశాలు లేకపోలేదు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.