తారక రత్నకి తీవ్ర అస్వస్థత..డీటెయిల్స్ ఇవే.!

తారక రత్నకి తీవ్ర అస్వస్థత..డీటెయిల్స్ ఇవే.!

Published on Jan 27, 2023 1:27 PM IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ నటుల్లో టాలెంటెడ్ నటుడు నందమూరి తారక రత్న కూడా ఒకరు. మరి తారక రత్న రీసెంట్ గానే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ “ఎస్ 5 నో ఎగ్జిట్” అనే చిత్రంలో కనిపించాడు. ఇక సినిమాలతో పాటుగా ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తాను దిగారు. తమ కుటుంబ పార్టీ అయినటువంటి తెలుగు దేశం పార్టీలోనే చేరి ఆ పార్టీ పనులు చూసుకుంటున్నారు.

మరి ఇదిలా ఉండగా ఆ పార్టీ యువ నేత నారా లోకేష్ “యువగళం” పేరిట ఈ మధ్యనే పాదయత్రని కూడా స్టార్ట్ చేశారు. మరి కుప్పం దగ్గరలో వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ తర్వాత లోకేష్ తన యాత్ర స్టార్ట్ చేయగా తర్వాత మసీదులో ప్రార్ధనలు జరిపారు మరి అక్కడ నుంచి తారక రత్న కూడా ఈ యాత్రలో పాల్గొనగా మసీదు నుంచి బయటకి వచ్చిన సమయంలో వారికి తమ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున మోహరించడంతో వాతావరణం కిక్కిరిసిపోయింది.

దీనితో ఆ సమయంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకి లోనయ్యి సొమ్మసిల్లి పడిపోయారట. దీనితో వెంటనే వారు తారకరత్న ని అక్కడి స్థానిక హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పుడు తారకరత్న ఆరోగ్యం కుదుటపడినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు