తారక్ పాత్రలో రెండు షేడ్స్ ఉండబోతున్నాయా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న ‘అరవింద సమేత’ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తైంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కు కూడ భారీ స్పందన దక్కింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో తారక్ రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తారని వినికిడి.

వాటిలో ఒకటి రాయలసీమ బ్యాక్ డ్రాప్లో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ఇంకొకటి హైదరాబాద్ నేపథ్యంలో సాగే సున్నితమైన పాత్రని అంటున్నారు. అయితే ఈ వార్తలు ఖచ్చితంగా నిజమో కాదో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాలి. అక్టోబర్ రెండవ వారంలో విడుదలకానున్న ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.

Exit mobile version