గత నాలుగైదేళ్ల రవితేజ చిత్రాలతో పోలిస్తే శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘ఇరుముడి’కి మార్కెట్‌లో అద్భుతమైన పాజిటివ్ బజ్ నెలకొంది. భక్తి అంశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు తోడు ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో నార్త్ అమెరికాలో ఇప్పటికే 150K డాలర్ల మార్కు దాటి అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే బుక్‌మైషోలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చి భారీ ఓపెనింగ్స్‌కు బాటలు వేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే రూ.45 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుంది.
2022లో వచ్చిన ‘ధమాకా’ తర్వాత సరైన విజయం లేని రవితేజకు తన క్రెడిబిలిటీని నిలబెట్టుకోవడానికి ‘ఇరుముడి’ అత్యంత కీలకమైన చిత్రం. కథలో థ్రిల్స్, ఎమోషన్స్ వర్కవుట్ అయి సినిమా బాగుంటే రవితేజ మళ్లీ ఘనవిజయంతో సక్సెస్ ట్రాక్‌లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
