టాక్సీవాలా కృష్ణా జిల్లా షేర్ !

యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం గత శనివారంవిడుదలై పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద మంచి కలక్షన్లను రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రాలోని కృష్ణా జిల్లాలో మూడవ రోజు రూ.10,23,174లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక మూడు రోజులకుగాను అక్కడ ఈ చిత్రం రూ.61,70,578లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది.

అలాగే ఈచిత్రం ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతూ హాఫ్ మిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది. ఈచిత్రానికి విడుదలకు ముందే పైరసీ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినగాని ఆ ప్రభావం కలక్షన్ల ఫై పడలేదు. దాంతో విజయ్ ఈ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రాహుల్‌ సంక్రిత్యాన్‌ తెరకెక్కించిన ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్2 అలాగే యూవీ క్రియేషన్స్ పతాకం ఫై ఎస్ కె ఎన్ నిర్మించారు.

Exit mobile version