సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. నిజానికి ఈసినిమా ఇటీవల విజయ్ నటించిన ‘గీత గోవిందం , నోటా’ చిత్రాల కన్నా ముందు విడుదలకావల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో తేడా రావడంతో ఆలస్యం అయ్యింది.
ఇక తాజాగా ఈచిత్రం నవంబర్ 16న విడుదలకు సిద్దమవుతుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. దాంట్లో భాగంగా ఈ చిత్రం లోని ‘మాటే వినదురా’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను అక్టోబర్ 26 మధ్యాహ్నం 2:30 గంటలకు విడుదల చేయనున్నారు. నూతన దర్శకుడు రాహుల్ సంక్రుత్యాన్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించాయి.
