‘ఎఫ్ 3’ టీమ్ కి వెంకీ స్పెషల్ టీ ట్రీట్ !

Published on Nov 7, 2021 7:56 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌ 3 సినిమా షూట్ గ్యాప్ లో టీమ్ కి వెంకీ స్పెషల్ టీ ట్రీట్ ఇచ్చాడు. ఈ టీ బ్రేక్ గురించి వరుణ్ తేజ్ పోస్ట్ చేస్తూ.. ‘వెంకీ బ్రో ఇంట్లో టీ టైమ్. లవ్లీ హోస్ట్‌ గా ఉన్నందుకు ధన్యవాదాలు’ అంటూ ఫోటో కూడా పోస్ట్ చేశాడు.

అలాగే అనిల్ రావిపూడి కూడా ఈ టీ పార్టీ గురించి పోస్ట్ చేస్తూ.. ‘షూట్ గ్యాప్ లో కొన్ని సరదా సంభాషణలతో మా వెంకీ గారి ఇంటి దగ్గర చిల్లింగ్ టీ బ్రేక్’ అంటూ మెసేజ్ తో ఫోటో కూడా పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటోలో వెంకీతో పాటు వరుణ్, తమన్నా, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, సునీల్ మరియు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు.

డార్క్ రూమ్ లో వెలుగులు జిమ్ముతున్న లైట్లు మధ్య.. గుమగుమలాడే టీని ఆస్వాదిస్తూ అందరూ నవ్వుతూ కనిపించారు. ఇక ‘ఎఫ్ 3’ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More