మస్కట్‌కి వెళ్లనున్న టీమ్ “ఏజెంట్”

Published on Feb 5, 2023 7:42 pm IST


యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన రాబోయే బిగ్గీ, ఏజెంట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న అన్ని ప్రధాన భారతీయ భాషల్లో భారీ స్క్రీన్‌లపైకి రానుందని నిన్న, మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం, 15 రోజుల షార్ట్ షెడ్యూల్ కోసం ఈ నెల 15న మస్కట్ వెళ్లేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.

ఈ షెడ్యూల్‌ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో మేకర్స్ వెల్లడించనున్నారు. పాన్ ఇండియన్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌కి వక్కంతం వంశీ స్క్రిప్ట్ రాశారు.

సంబంధిత సమాచారం :