రేపు మీడియా ముందుకు ‘బాహుబలి’ టీమ్!
Published on Sep 29, 2016 3:10 pm IST

baahubali
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చనడంలో సందేహం లేదన్న విషయం తెలిసిందే. గతేడాది జూలై నెలలో విడుదలై ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఇక ఇప్పటికే క్లైమాక్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న ‘బాహుబలి 2’కు సంబంధించిన మీడియా సమావేశాన్ని రేపు టీమ్ హైద్రాబాద్‌లో నిర్వహించనుంది.

ఈ మీడియా సమావేశంలో సినిమా ప్రొడక్షన్, ప్రీ రిలీజ్ బిజినెస్, పోస్టర్స్, టీజర్, రిలీజ్ సంబంధిత అన్ని వివరాలను ప్రకటించేందుకు రాజమౌళి అండ్ టీమ్ సిద్ధమవుతోంది. ‘బాహుబలి 2’ మొదలయ్యాక టీమ్ నిర్వహిస్తోన్న మొదటి ప్రెస్ మీట్ ఇదే కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బాహుబలి మొదటి భాగాన్ని మించేలా రెండో భాగం ఉండాలని బాహుబలి 2 కోసం శ్రమిస్తోంది.

 
Like us on Facebook