వైరల్: మహేశ్ బాబు డైలాగ్ చెప్పిన టీమిండియా మాజీ క్రికెటర్..!

Published on Sep 11, 2021 1:57 am IST


టాలీవుడ్ హీరోలను అనుసరిస్తూ వారు చెప్పిన డైలాగులను ఈ మధ్య క్రికెటర్లు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్‌ వార్నర్ గురుంచి అయితే ఇక చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ హీరోల డైలాగులు, డ్యాన్సులతో వార్నర్ సోషల్ మీడియాను షేక్ చేశాడు. మొన్నటికి మొన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలోని పవన్ కళ్యాణ్ డైలాగును చెప్పి అలరించాడు.

అయితే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్‌ కైఫ్‌ సూపర్‌ స్టార్‌ మ‌హేశ్ బాబు పాపుల‌ర్ డైలాగ్ చెప్పి ఔరా అనిపించాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కైఫ్ మహేశ్ బాబు దూకుడు సినిమాలోని “మైండ్‌లో ఫిక్స‌యితే బ్లైండ్‌గా వెళ్లిపోతా” అనే పాపులర్ డైలాగ్‌ను చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మహేశ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :