అడివి శేష్ “మేజర్” కి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల విషయం లో కీలక నిర్ణయం!

Published on May 27, 2022 6:12 pm IST

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా మేజర్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం ప్రీమియర్ షో లతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ చూసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ లో సింగిల్ స్క్రీన్ 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 147 రూపాయలు సింగిల్ స్క్రీన్ కి, 177 రూపాయలు మల్టీప్లక్స్ కి నిర్దేశించారు. దీంతో ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :