“ప్రాజెక్ట్ కే” సెట్స్ నుంచి “RRR” టెక్నీషియన్ కి కంగ్రాట్స్.!

Published on Feb 26, 2023 2:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో వరల్డ్ లెవెల్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కోసం తెలిసిందే. మరి ఈ సినిమా మాసివ్ రిలీజ్ కోసం కూడా మేకర్స్ ఆల్రెడీ బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ కూడా అందించారు. మరి ఈ సినిమాని అత్యున్నత ప్రమాణాలతో భారీ హంగులతో అయితే ఈ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

మరి ఈ సినిమా సెట్స్ నుంచి అయితే మేకర్స్ ఇండియాస్ ప్రైడ్ చిత్రం రౌద్రం రణం రుధిరం సినిమాకి వర్క్ చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్ సాలొమోన్ కి స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేసారు. తాను తమ సినిమా సెట్స్ నుంచి వర్క్ చేస్తున్న పిక్ తో అయితే హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నందుకు గాను అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. మరి RRR అదిరే యాక్షన్ అందించిన తాను ఇక ఈ వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ లో అయితే ఎలాంటి సీక్వెన్స్ లు తెరకెక్కించారో చూడాలి.

సంబంధిత సమాచారం :