
టాలీవుడ్ లో చాలా కాలం క్రితం ఆగిపోయిన పీరియాడికల్ ఫిల్మ్స్ కి మళ్ళీ ఊపిరి పోసిన సినిమాలు ‘బాహుబలి’ మరియు ‘రుద్రమదేవి’. అందులో బాహుబలి ఇప్పటికే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిపోవడంతో అందరి చూపు రుద్రమదేవి పైకి షిఫ్ట్ అయ్యింది. కానీ ఈ సినమా అదిగో, ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చి ఫైనల్ గా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 9న రిలీజ్ చెయ్యడానికి అన్ని ప్లాన్ చేసారు. కానీ సడన్ గా నిన్న ఉదయం అనుష్క పివిపి బ్యానర్ లో చేసిన ‘సైజ్ జీరో’ సినిమాని అక్టోబర్ 9న రిలీజ్ చేయనున్నామని అనౌన్స్ చేయడంతో రుద్రమదేవి రిలీజ్ వాయిదా పడుతుందని అందుకే సైజ్ జీరో రిలీజ్ అవుతుందనే వార్తలు ఊపందుకున్నాయి.
కానీ ఈ చిత్ర టీం మాత్రం సినిమా అక్టోబర్ 9నే రిలీజ్ అవుతుందని ఖరార్ చేసి చెప్పారు. అంతే కాకుండా ఈ రోజు న్యూస్ పేపర్స్ లో అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్ అంటూ ప్రమోషనల్ యాడ్స్ ఇవ్వడమే కాకుండా టీవీలలో కూడా రిలీజ్ డేట్ మెన్షన్ చేస్తూ యాడ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇలా రుద్రమదేవి టీం సినిమా రిలీజ్ లో ఎలాంటి వాయిదా లేదని మరోసారి స్ట్రాంగ్ గా ఖరారు చేసారు. మరి స్వీటీ అనుష్క నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయా లేక అందులో ఇంకేమన్నా పోస్ట్ పోన్ అవుతాయా అనేది చూడాలి. అన్ని భాషల డబ్బింగ్ వర్క్స్ తో పాటు, 3డి వర్క్ ని కూడా ఫినిష్ అవుతోంది. రుద్రమదేవిగా అనుష్క కనిపించనున్న ఈ సినిమాలో చాళుక్య వీరభద్రుడుగా రానా, గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు.