“రైటర్ పద్మభూషణ్” టీమ్ స్వీట్ సర్ ప్రైజ్!

“రైటర్ పద్మభూషణ్” టీమ్ స్వీట్ సర్ ప్రైజ్!

Published on Feb 7, 2023 4:13 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ యొక్క తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్ గత శుక్రవారం థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఈరోజు, మేకర్స్ తమ సోషల్ ప్రొఫైల్స్ ద్వారా ఆశ్చర్యకరమైన ప్రకటన చేసారు.

కేవలం మహిళల కోసమే తెలుగు రాష్ట్రాల్లో 28 స్పెషల్ షోలు ప్రదర్శించాలని టీమ్ ప్లాన్ చేసింది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మహిళలు ఉచితంగా సినిమా చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఇది అద్భుతమైన అవకాశం. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు, గౌరి ప్రియారెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు