త్వరలో విడుదలకానున్న రానా కొత్త సినిమా టీజర్ !
Published on Jun 4, 2017 2:02 pm IST


టాలీవుడ్ స్టార్ నటుడు రానా దగ్గుబాటి ప్రస్తుతం తేజ డైరెక్షన్లో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తికి చేసుకున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు టీమ్. ఈ నెల 6వ తేదీన ఈ టీజర్ ను విడుదలచేయనున్నారు. పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతున్న ఈ సినిమా రానా కెరీర్లో ఒక మైలు రాయిగా మిగిలిపోతుందనే టాక్ వినిపిస్తోంది.

అంతేగాక బాహుబలి చిత్రంతో రానా సంపాదించిన భారీ స్థాయి క్రేజ్ కూడా ఈ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచుతోంది. రానా తన సినీ కెరీర్ ను ‘లీడర్’ లాంటి పొలిటికల్ డ్రామాతోనే మొదలుపెట్టడం విశేషం. కాజల్ అగర్వాల్, క్యాథరిన్ థ్రెసలు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు, భారత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook