ఇంట్రెస్టింగ్ గా “సెబాస్టియన్ పి సి 524” టీజర్.!

Published on Feb 5, 2022 2:00 pm IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా నుంచి కూడా ఆసక్తికర కథలతోనే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అలాగే చేసిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా “సెబాస్టియన్ పి సి 524”. బాలాజీ సయ్యపు రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కూడా ఇపుడు ఫిబ్రవరి నెల రిలీజ్ కి రెడీగా ఉండగా దీని టీజర్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు.

అయితే ఈ టీజర్ మాత్రం మంచి థ్రిల్లింగ్ గా మరియు ఫన్నీ గా ఉందని చెప్పాలి. సెబాస్టియన్ అనే పోలీస్ గా అందులోని తనకి రే చీకటి ప్రాబ్లెమ్ ఉన్న వాడిగా కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ గా కనిపించాడు. అలాంటి వ్యక్తి పోలీస్ గా చేస్తే ఎలా ఉంటుంది? అదే రాత్రి సమయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేవి ఈ ట్రైలర్ లో ఆసక్తిగా అనిపిస్తున్నాయి.

అలాగే తన తల్లికి ఇచ్చిన మాట యాక్షన్ ఎలిమెంట్స్ తో వేరే ఎమోషన్స్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఇంకా ఈ టీజర్ లో జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ సెబా బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. మరి వచ్చే ఫిబ్రవరి 25 న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :