సందీప్ కిషన్ కు ఈసారి సక్సెస్ ఖాయంగా కనిపిస్తోంది !


యంగ్ హీరో సందీప్ కిషన్ కు ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తర్వాత ఆ స్థాయి కమర్షియల్ హిట్ అందలేదనే చెప్పాలి. మధ్యలో వచ్చిన ‘శమంతకమణి, నగరం’ వంటి సినిమాలు పర్వాలేదనిపించినా రీసెంట్ గా చేసిన ‘నక్షత్రం’ సినిమా కూడా పరాజయాన్ని చవిచూడటంతో ఇప్పుడు ఆయనకు హిట్ అత్యవసరమైంది. ప్రస్తుతం ఆయన చేసిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘కేరాఫ్ సూర్య’ విడుదలకు సిద్ధమవుతోంది.

కొద్దిసేపటి క్రితమే హీరో నాని చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే సినిమా కామెడీ, రొమాంటిక్ ట్రాకే లతో మంచి ఎంటర్టైనర్ గా అదే విధంగా దర్శకుడు సుశీంద్రన్ స్టైల్లో థ్రిల్లింగా కూడా ఉండనుందని అర్థమవుతోంది. సందీప్ కిషన్ పాత్రైతే మంచి ఫన్ కు కలిగి ఆసక్తికరంగా అనిపిస్తోంది. మొత్తం మీద టీజర్ సినిమా సందీప్ కిషన్ కు అవసరమైన విజయాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో చక్రి చిగురుపాటి రిలీజ్ చేస్తున్నారు.

టీజర్ కోసం క్లిక్ చేయండి :