టీజర్ టాక్: ఇంటెన్స్ యాక్షన్, ప్రేమ అంశాలతో ఇంట్రెస్టింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’

ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న మరో యంగ్ అండ్ చార్మింగ్ హీరో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా యువ హీరోయిన్ రాషా తడానీ కూడా టాలీవుడ్ కి పరిచయం అవుతూ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న సినిమానే “శ్రీనివాస మంగాపురం”. మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ని ఇప్పుడు వదిలారు.

అయితే ఈ టీజర్ లో యువ జంటపై ఒక బ్యూటిఫుల్ ప్రేమకథతో స్టార్ట్ చేసిన దర్శకుడు వారి ప్రేమ కథతోనే ఒక ఇంటెన్స్ యాక్షన్ ని కూడా మిళితం చేయడం మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. హీరో పేరు శ్రీనివాస్ గా జయకృష్ణ, మంగ గా హీరోయిన్ రాషా ఇద్దరి ప్రేమకథ తిరుపతిలో ప్లాన్ చేయడం వీరి లవ్ స్టోరీలో అంతర్లీన పాయింట్ గా కనిపిస్తుంది. ఇక ఇద్దరూ మంచి కెమిస్ట్రీ కనబరచడమే కాకుండా పెర్ఫామెన్స్ లు పరంగా కూడా ఇంప్రెస్ చేసేలా కనిపిస్తున్నారు.

అలాగే అజయ్ భూపతి మార్క్ కాస్టింగ్ తో మోహన్ బాబు, నరేష్ లాంటి నటుల నుంచి కూడా సాలిడ్ పాత్రలు పడినట్టు ఇందులో కనిపిస్తుంది. ఇలా మొత్తంగా మాత్రం ఈ టీజర్ మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పవచ్చు. జీవీ ప్రకాష్ సంగీతం టీజర్ లో మరింత ప్లస్ అయ్యింది. ఇక ఈ సినిమాకి జెమినీ కిరణ్ నిర్మాణం వహిస్తుండగా వైజయంతి మూవీస్ వారి సమర్పణలో సినిమా విడుదలకి రానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version