పవన్ “తీన్ మార్” ఫెయిల్యూర్ పై ఓపెన్ అయ్యిన దర్శకుడు.!

పవన్ “తీన్ మార్” ఫెయిల్యూర్ పై ఓపెన్ అయ్యిన దర్శకుడు.!

Published on Jun 3, 2023 7:03 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాల్లో చాలానే రీమేక్ సినిమాలు ఉండగా వాటిలో కూడా ప్లాప్ చిత్రాలు ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఓ దశాబ్ద కాలం కితం థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన చిత్రం “తీన్ మార్” కూడా ఒకటి. దర్శకుడు జయంత్ సి పరాన్జీ అయితే తెరకెక్కించిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నా అప్పట్లో మాత్రం పలు కారణాల చేత భారీ ప్లాప్ గా నిలిచిపోయింది.

అయితే ఈ సినిమా ఎందుకు ప్లాప్ అవ్వాల్సి వచ్చింది అనే దానిపై జయంత్ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇవ్వడం వైరల్ గా మారింది. అప్పట్లో సినిమా చూసి కొందరు ఫ్యాన్స్ నా దగ్గరకి వచ్చి సినిమాలో ఆల్రెడీ వేరే ఒకరితో పెళ్లి అయ్యిన అమ్మాయి కి పవన్ పాత్రని ఎలా కలుపుతారు అని అడిగారు అని బహుశా ఇది అందుకు ఓ కారణం కాగా ఇదే ప్రశ్న నేను పవన్ ని వెళ్లి అడగండి అంటే వారు అంతా అక్కడ నుంచి కామ్ గా వెళ్లిపోయారు అని చెప్పారు.

అలాగే అప్పుడు ఆ పాత్రకి అయితే పవన్ ఇమేజ్ సెట్ అవ్వలేదేమో అనిపించింది అని తాను తెలిపారు. పవన్ ని అలాంటి రోల్ లో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు అని అన్నారు. ఒకవేళ అదే రోల్ సిద్ధార్థ్, తరుణ్ లాంటి యంగ్ హీరోస్ ఉండి ఉంటే నచ్చేది ఏమో అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు