అక్టోబర్ 29న థియేటర్ల లోకి రానున్న “తీరం”

Published on Oct 18, 2021 7:10 pm IST


అకి క్రియేటివ్ వర్క్స్, యల్ యస్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరో హీరోయిన్స్ గా యం.శ్రీనివాసులు నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం తీరం. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ 29న అత్యధిక ధియేటర్సలలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ, “యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా నిర్మాత శ్రీనివాసులు గారు కథని నమ్మి నా మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మించారు. సినిమా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 29న మా చిత్రం విడుదలవుతుంది. తప్పకుండా తీరం సినిమాని చూసి సక్సెస్ చేయాలి” అని అన్నారు.

మరో హీరో శ్రావణ్ వైజిటి మాట్లాడుతూ, “తీరం లో మెయిన్ హీరోగా చేశాను, అనిల్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. సినిమా యూత్ ఆడియెన్స్ కి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఒక మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది” అని అన్నారు.

చిత్ర నిర్మాత యం. శ్రీనివాసులు మాట్లాడుతూ, “కొత్త వారైనా కూడా తీరం చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దారు. సెన్సార్ పనులు అన్నీ పూర్తి అయ్యాయి. మా సినిమాని అక్టోబర్ 29న సినేటెరియా సంస్థ ద్వారా వెంకట్ గారు రిలీజ్ చేస్తున్నారు. సినిమాని ఆదరించి పెద్ద విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

సినేటెరియా గ్రూప్ సంస్థ అధినేత వెంకట్ బోలేమోని మాట్లాడుతూ, “తీరం ఒక అద్భుతమైన ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం. సినిమా చూశాను, శ్రీనివాసులు గారి మేకింగ్, అనిల్ టేకింగ్ బ్యూటిఫుల్ అనే చెప్పాలి. మ్యూజిక్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుంది. మా సినేటెరియా ద్వారా ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న అత్యధిక థియేటర్ల లో భారీగా రిలీజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

సంబంధిత సమాచారం :