కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. ప్రపంచవ్యాప్తంగా జులై 6న విడుదలకానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా చెప్పకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇది నిజంగా శుభ పరిణామనే అనాలి.
క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై కే.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. పూర్తిగా కరుణాకర్ శైలిలో తెరకెక్కిన ఈ చిత్రంలో తేజు , అనుపమల కెమిస్ట్రీ హైలైట్ అవ్వనుంది. వరుస పరాజయాల తో ఇబ్బందుల్లో ఉన్న తేజుకు ఈ చిత్ర విజయం చాలా అవసరం.
