ఇప్పటివరకు యాక్షన్ మరియు లవ్ ఎంటర్టైనర్ సినిమాల్లోనే నటించిన సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కొత్త జోనర్లో సినిమా చేయనున్నాడు. కథారచయిత నుండి దర్శకుడిగా మారిన ‘బిందాస్’ ఫెమ్ వీరు పోట్ల చారిత్రక నేపథ్యంలో ఒక కథను సిద్ధం చేశాడట. ఈ చిత్రంలో హీరోగా నటించనున్నాడట తేజు. శ్రీ కృష్ణదేవరాయలు కాలం నాటి కథతో సాగె ఈ పీరియాడిక్ మూవీకి సంబంధించిన వివరాలను తొందర్లోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
ఇక ప్రస్తుతం తేజు నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో తేజు కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. జులై 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఫై తేజు చాలా ఆశలే పెట్టుకున్నాడు.
