ఎన్టీఆర్ జీవితంలో చాలా డ్రామా ఉందంటున్న తేజ !

2nd, November 2017 - 08:29:57 AM

నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ను దర్శకుడు తేజ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ‘ఒక వ్యక్తి యొక్క బయోపిక్ ను తీయాలంటే అతని జీవితంలో చాలా నాటకీయ పరిణామాలు ఉండాలి. సాధారణమైన వ్యక్తి నుండి మహనీయుడిగా ఎదిగిన ఎన్టీఆర్ జీవితంలో చాలా డ్రామా ఉంది’ అన్నారు.

అంతేగాక స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని, సినిమాను నాటకీయంగా చెప్పడానికి ట్రై చేస్తున్నానని, లేకపోతే అది డాక్యుమెంటరీ అవుతుందని అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా బాలక్రిష్ణ నటిస్తుండగా హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి నుండి మొదలుకానుంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు వంటి ముఖ్యుల పాత్రలు ఎవరు పోషిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.