మ్యాటర్ క్లియర్ చేసిన తేజ !

20th, October 2017 - 05:07:54 PM


ఇటీవలే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు తేజ ప్రస్తుతం బాలకృష్ణ పర్యవేక్షణలో రూపొందనున్న ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటే ఆయన విక్టరీ వెంకటేష్ తో కూడా ఉండనుందని తెలిసింది.

కాగా వీటి రెండింటిలో ఎన్టీఆర్ బయోపిక్ అతి త్వరలో మొదలుకానుండగా వెంకీ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానం మొదలైంది. కానీ సినిమా తప్పక ఉంటుందని తేజ ఖాయం చేసేశారు. రెండు సినిమాలు త్వరలోనే మొదలవుతాయని, వీటిలో నటీనటుల వివరాలు, ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. మరి తేజ రెండు సినిమాల్ని ఒకేసారి చేస్తారా లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.