రానా తో చేయనున్న మూవీ టైటిల్ రివీల్ చేసిన డైరెక్టర్ తేజ

Published on May 28, 2023 2:04 am IST

గతంలో రానా దగ్గుబాటి తో దర్శకుడు తేజ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ మూవీ నేనే రాజు నేనే మంత్రి. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం రానా సోదరుడు అభిరాం తో అహింస అనే లవ్, యాక్షన్, ఎమోషనల్ మూవీ తీస్తున్నారు తేజ. గీతిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. తాజగా నేడు అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాల లోని ఎన్ ఆర్ పి ఎం హై స్కూల్ లో వైభవంగా జరిగింది. రానా దగ్గుబాటి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ఈ ఈవెంట్ లో డైరెక తేజ మాట్లాడుతూ, అహింస తప్పకుండా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

రానా తో త్వరలో తాను చేయనున్న మూవీకి రాక్షస రాజు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాతో 45 మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు దీని కోసం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను సంప్రదించవచ్చని తేజ వెల్లడించారు. రామానాయుడు స్వస్థలమైన చీరాల నుంచి తనకు ఆల్టెస్ట్ 10 మంది కావాలని తేజ చెప్పారు. గోపీనాథ్ ఆచంట ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ మూవీలో రానా కోసం తేజ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడని టాలీవుడ్ బజ్. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో నటించనున్న ఇతర నటీనటులు మరియు సాంకేంతిక సిబ్బందికి సంబంధించిన ఇతర వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :