తేజ సజ్జ ‘హను మాన్’ టీజర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్

తేజ సజ్జ ‘హను మాన్’ టీజర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్

Published on Nov 12, 2022 10:11 PM IST


తేజ సజ్జ హీరోగా యువ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ హను మాన్. ఇటీవల అ, కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న ప్రశాంత్ వర్మ, హను మాన్ ని కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అద్భుతమైన కథ, కథనాలతో రూపొందిస్తున్నట్లు చెప్తోంది యూనిట్. ఇక ఇప్పటికే ఈ మూవీలో నటించనున్న ముఖ్య పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేసారు. ఇందులో హనుమంతు గా తేజ సజ్జ, అతనికి జోడీగా మీనాక్షి పాత్రలో అమృత అయ్యర్, అలానే కీలక పాత్ర అయిన అంజమ్మ గా వరలక్ష్మి శరత్ కుమార్ ల క్యారెక్టర్స్ పరిచయం చేయడం అవి ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి క్యూరియాసిటీని ఏర్పరచడం జరిగింది.

ఇక హను మాన్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని నవంబర్ 15న విడుదల చేస్తున్నట్లు మొన్న ప్రకటించిన యూనిట్, కొద్దిసేపటి క్రితం టీజర్ లాంచ్ టైం, డేట్, వెన్యూ వంటి వివరాలను అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కాగా హను మాన్ టీజర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ స్క్రీన్ 1 లో నవంబర్ 15 ఉదయం 9 గం. ల నుండి నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు