ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ ల “హనుమాన్” మూవీ లేటెస్ట్ అప్డేట్!

Published on Mar 17, 2022 6:00 pm IST


తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరో మూవీ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం హనుమాన్. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను అనౌన్స్ చేసిన మొదటి నుండి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం 100 రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది అని ఒక వీడియో ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఎంతో మంది ఈ చిత్రం కోసం కష్ట పడుతున్నట్లు తెలిపారు. అంతేకాక ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది అని తెలిపారు. తెలుగు తో పాటుగా పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం ను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :