బయోపిక్ కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్న తేజ !

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్ అందుకుని సక్సెస్ బాట పట్టిన దర్శకుడు తేజ ప్రస్తుతం బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో దివంగత ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి టీజర్ షూట్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. ఈలోపు తేజ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం గారి పాత్ర కోసం నటిని వెతికే పనిలో పడ్డారు.

అందుకోసం ఫేషియల్ రెకగ్నిషన్ అనే కొత్త తరహా టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. దీని ద్వారా అచ్చు బసవతారకంగారి పోలికలకు దగ్గర ఉండే నటిని సులభంగా ఎంచుకోవడానికి వీలుంటుంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం చాలా మంది ప్రొఫైల్స్ పంపడంతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు తేజ. ఇకపోతే ఈ చిత్ర టీజర్ ను జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతినాడు రిలీజ్ చేయనున్నారు.