తారక్ పై తేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తారక్ పై తేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on May 28, 2023 7:24 PM IST

రానా సోదరుడు అభిరామ్‌ ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ ‘అహింస’ అనే సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన తర్వాతి సినిమా గురించి ప్రకటించారు తేజ. అది కూడా రానాతోనే చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఐతే, ఈ సినిమా టైటిల్ ను ‘రాక్షస రాజు’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఐతే, తేజ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఓ ఇంటర్వ్యూలో ‘ఎన్టీఆర్తో సినిమా చేయాలని అనుకుంటే ఎలాంటి సినిమా చేస్తారు’’ అని దర్శకుడు తేజాను యాంకర్ అడగ్గా.. ‘ఎన్టీఆర్ తో సినిమా చేసేంత టాలెంట్ నాకు లేదు’’ అని తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తేజ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దగ్గుబాటి అభిరామ్ కి ‘అహింస’తో తేజ ఏ రేంజ్ విజయాన్ని అందిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు