నానీకి క్షమాపణలు చెప్పిన తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్.!

Published on Aug 21, 2021 6:03 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సున్నితమైన అంశాల పట్ల గరంగరం చర్చలే నడుస్తున్నాయి. ఊహించని ప్రమాదం కరోనా మూలాన థియేటర్స్ వ్యవస్థ నుంచి సినిమాలు ఓటిటి బాట పట్టడం సినిమానే నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్ కి థియేటర్స్ యజమానులకు తలనొప్పిగా మారింది. మరి ఈ విషయంలోనే పలు స్పర్ధలు కూడా నడుస్తున్నాయి. అయితే రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం “టక్ జగదీష్” వివాదాల్లో పడింది.

పలు కారణాలు, ఒత్తిళ్లు చేత ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటికే వెళ్లడం పైగా థియేట్రికల్ గా రిలీజ్ అవుతున్న చిత్రాలకు పోటీగా రిలీజ్ అవుతుంది అని టాక్ రావడం నాని పై కారణం లేని కోపానికి దారి తీసింది. అయితే నాని ముందు నుంచి కూడా తాను థియేటర్స్ వ్యవస్థకే సపోర్ట్ గా ఉన్నానని తన సినిమా ఓటిటి రిలీజ్ విషయంలో తుది నిర్ణయం నిర్మాతలదే అని ఒక భావోద్వేగ పూరిత లేఖను అందించాడు.

అది వచ్చినప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి మీట్ లో నానీ సినిమాలు ఇక థియేటర్స్ లో తీసుకోబోమని వాటిపై బ్యాన్ విధిస్తున్నామని స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. కానీ ఇప్పుడు వారు మళ్ళీ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసి క్షమాపణలు చెప్తున్నట్టుగా తెలిపారు. తాము ఎవరినీ పర్సనల్ గా టార్గెట్ చెయ్యలేదని తమ ఉద్దేశం అది కాదు అని తమ ఎగ్జిబిటర్లు చెప్పిన మాటలకి తాము క్షమాపణలు చెబుతున్నామని తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ వారు క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :