ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పలు భారీ సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక పక్క ఈ సినిమాలు మరోపక్క తన సినిమా మల్టీప్లెక్స్ లని బన్నీ విస్తరిస్తూ వెళుతున్నాడు. ఆల్రెడీ హైదరాబాద్ లో ట్రిపుల్ ఏ అనే మల్టీప్లెక్స్ ఉంది. ఇది కాకుండా మరింత హై క్లాస్, హై టెక్ తో కూడిన మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ గా అల్లు అర్జున్ ప్లాన్ చేయడం జరిగింది. కోకాపేట్ లో నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడెప్పుడు తెరుచుకుంటుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం మూవీ లవర్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తున్న కొత్త వెర్షన్ డాల్బీ సినిమా కూడా ఇందులో ఉంది. అందుకే చాలామంది ఇదెప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. మరి ఫైనల్ గా మార్చ్ 12న ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ లాంచ్ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి తన చేతులు మీదుగా ఆరంభించనున్నారని టాక్. దీనితో ఈ టాక్ వైరల్ గా మారింది. ఇక మార్చ్ 19 వస్తున్న సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 లు ఇందులో ట్రీట్ అందించనున్నాయి.
