భీమ్లా నాయక్‌ పాటపై తెలంగాణ పోలీసుల అభ్యంతరం..!

Published on Sep 3, 2021 1:35 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఆయన నటిస్తున్న “భీమ్లా నాయక్‌” సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ పాటపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలోని కొన్ని పదాలు పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్‌ ట్వీట్ చేశారు.

తెలంగాణ పోలీసులు పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులు అని తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టమని అన్నారు. పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయని డీసీపీ ట్వీట్‌ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ. ఇదిలా ఉంటే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా, మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్స్ అందించారు.

సంబంధిత సమాచారం :