నవంబర్ 12న థియేటర్లలోకి కేసీఆర్ బయోపిక్ “తెలంగాణ దేవుడు”..!

నవంబర్ 12న థియేటర్లలోకి కేసీఆర్ బయోపిక్ “తెలంగాణ దేవుడు”..!

Published on Oct 27, 2021 12:14 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ టైటిల్‌ రోల్లో నటించిన ఈ సినిమాకు వడత్యా హరీష్ దర్శకత్వం వహించగా, మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. ఈ సినిమాలో జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడు కాగా, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, వెంకట్‌, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబరు 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగింది, ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వడం వంటి అంశాలను ఎంతో డ్రామాటిక్‌గా తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు