ఆడియో ఆవిష్కరణలో ‘తెలంగాణ దేవుడు’ !

హ‌రీష్ వ‌డ్‌త్యా ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌కాంత్‌, సంగీత, జిషాన్ ఉస్మాని, , హీరో హీరోయిన్లుగా మ్యాక్ ల్యాబ్స్ ప్రై. లిమిటెడ్ బ్యాన‌ర్ పై.. మొహ్మ‌ద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదిత్య మ్యూజిక్ ద్వారా హైదరాబాద్ పార్క్ హయాత్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, మొహ్మ‌ద్ జాకీర్ ఉస్మాన్ చిత్ర సీడీలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మొహ్మ‌ద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ… ‘‘ఈ ఆడియో కార్యక్రమానికి వచ్చి మమ్మల్నీ ఆశీర్వదించిన పెద్దలందరికీ మా టీమ్ త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత బాగా రావడానికి సహకరించిన న‌టీన‌టులకు, సాంకేతిక నిపుణులకు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.

హీరో జిషాన్ ఉస్మాని మాట్లాడుతూ.. ‘‘నాతో పాటు ఈ చిత్రంలో న‌టించి, నాకు విలువైన సూచనలు ఇచ్చిన న‌టీన‌టులంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన మా డైరెక్ట‌ర్‌గారికి ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు. ఐ ల‌వ్ మై డాడ్..’’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ నంద‌న్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాకి సంగీతం చేసే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. నా సాంగ్ విన్నాక ప్రొడ్యూస‌ర్ గారు న‌న్ను ఎ.ఆర్‌.రెహ‌మాన్ అని అన్నారు. అది నేను మ‌ర్చిపోలేను. ఆయ‌న‌కు నా మీద ఉన్న న‌మ్మకానికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ పాట‌లు ఇంత అద్భుతంగా రావ‌డానికి ప్రొడ్యూస‌ర్‌గారు, డైరెక్ట‌ర్‌గారు అందించిన స‌హాయ స‌హ‌కారాలను మరిచిపోలేను..’’ అని అన్నారు.

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ.. ‘హ‌రీష్ ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌ని చాలా బాగా తీర్చిదిద్దారు. ఇందులో హీరోగా నటించిన జిషాన్ నా తమ్ముడు లాంటి వాడు. త‌న‌కు ఆల్ ద బెస్ట్‌. మంచి అద్భుత‌మైన మ్యూజిక్‌ని అందించారు మ్యూజిక్ డైరెక్టర్. మేమంతా ఒక ఫ్యామిలీలాగా క‌లిసి చేశాం. ఎక్క‌డా ఏ పొర‌పాటు రాకుండా ఒళ్ళు ద‌గ్గ‌ర పెట్టుకుని చాలా చ‌క్క‌గా చేసిన చిత్ర‌మిది. మీరంద‌రూ ఈ చిత్రాన్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: నందన్ రాజు బొబ్బిలి, ఎడిటర్: గౌతంరాజు, కెమెరా: విజయ్ కుమార్, మూలకథ- నిర్మాత: మొహ్మద్ జాకీర్ ఉస్మాన్, రచన-దర్శకత్వం: హరీష్ వడ్‌త్యా.

Exit mobile version