నేను కూడా బాడీ షేమింగ్‌కి గురయ్యాను – గవర్నర్‌ తమిళిసై

Published on Jan 29, 2022 11:00 pm IST

న్యాచురల్ స్టార్ నాని, సాయిపల్లవి, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్యామ్ సింగరాయ్”. గత ఏడాది డిసెంబర్ 24న థియేటర్లలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదంటూ తమిళంలో ప్రచురితమైన ఓ వార్తపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ఒక ఛానెల్‌లి ఇచ్చిన ఇంటర్వ్యూలొ మాట్లాడుతూ ఒక టాలెంటెడ్ నటిని బాడీ షేమింగ్ చేయడం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు.

అయితే గతంలో నా రూపం పట్ల కూడా ట్రోలింగ్‌కి గురయ్యానని, నల్లగా ఉన్నానని, పొట్టిగా ఉన్నానని చాలామంది నన్ను ఏడిపించేవారు. ఆ మాటల వల్ల నేను చాలా బాధపడ్డానని తమిళి సై తెలిపారు. నా ప్రతిభతో, నా శ్రమతో అలాంటి మాటలను పట్టించుకోకుండా ముందుకెళ్లాను. అలా పుట్టడం నా తప్పు కాదు. చూసేవారి చూపును బట్టి అందం ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంటుంది. కాకి పిల్ల కాకికి ముద్దు అని.. కాకి తన పిల్ల నల్లగా ఉన్నా బంగారు పిల్లగా భావిస్తుందని అంతేకాని వదిలేసి వెల్లదు అని అన్నారు. అయితే స్త్రీలే ఎక్కువగా బాడీ షేమింగ్ కి గురవుతున్నారని, 50 ఏళ్ల పురుషులు మాత్రం ఇప్పటికి యువకుల్లానే పరిగణించబడుతున్నారని అన్నారు. ఇలాంటిది మారాలి అని మహిళల ఎదుగుదలను ప్రోత్సహించాలి తప్పా ఇలాంటి ట్రోల్స్ చేస్తూ వారి ఎదుగుదలని తగ్గించే ప్రయత్నం చేయకూడదని అన్నారు.

సంబంధిత సమాచారం :