మన తెలుగు ఆడియెన్స్ సినిమాలని ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే. మరి ఈ వేడుకల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్ రిలీజ్ రోజే లేదా ముందు రోజు రాత్రే సినిమాలు పడిపోతూ ఉంటాయి. ఇలా లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ చిత్రం “పుష్ప 2” కి కూడా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా జరిగాయి.
అయితే లేటెస్ట్ గా పుష్ప 2 రిలీజ్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఓ విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ ఘటనతో దుమారం రేగగా ఇపుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి తెలంగాణాలో ఎలాంటి బెనిఫిట్ షోస్ వేసేది లేదు అని తేల్చేసారు. సో ఇక నెక్స్ట్ నుంచి తెలంగాణాలో ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండబోయేది లేదు అని చెప్పాలి.