కేజీఎఫ్ 2 టికెట్ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Published on Apr 12, 2022 2:32 pm IST


యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ గురువారం థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్ మరియు రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే, తెలంగాణ ప్రభుత్వం రోజుకు 5 షోలు ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది.

అంతేకాక సాధారణ టిక్కెట్ ధరపై మల్టీప్లెక్స్‌లలో 50 రూపాయలు మరియు సింగిల్ స్క్రీన్‌లలో 30 రూపాయలను పెంచడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది మొదటి 4 రోజులకు మాత్రమే వర్తిస్తుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో రావు రమేష్, ప్రకాష్ రాజ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేజీఎఫ్ 2కి రవి బస్రూర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :