ఇది కరెక్ట్ కాదు.. నిర్మాతలపై థియేటర్ల ఓనర్స్ అసంతృప్తి..!

ఇది కరెక్ట్ కాదు.. నిర్మాతలపై థియేటర్ల ఓనర్స్ అసంతృప్తి..!

Published on Aug 20, 2021 2:23 AM IST

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కరోనా వలన మొన్నటి వరకు మూతపడిన థియేటర్స్ ఈ మధ్యే తెరుచుకున్నాయి. దీంతో చాలా సినిమాలు రిలీజ్ అవుతుండగా, మరికొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నాయి. అయితే మొన్నటివరకు థియేటర్స్ మూసి ఉండడంతో చాలా సినిమాలు ఓటీటీలను ఆశ్రయించాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ తెరుచుకున్నా కూడా కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్‌కే సిద్ధమవుతున్నాయి.

అయితే నాగచైతన్య-సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అయితే ఇదే రోజు నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. దీనిపైనే తెలంగాణ థియేటర్ల ఓనర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్లకు మద్దతు ఇవ్వాల్సిన నిర్మాతలు ఓటీటీని ఆశ్రయించడం కరెక్ట్ కాదని అంటున్నారు. దీనిపై చర్చించేందుకు నేడు తెలంగాణ థియేటర్ ఓనర్స్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ద్వారా థియేటర్ల ఓనర్స్ నిర్మాతలకు పలు డిమాండ్లు వినిపించే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు