“తెలిసిన వాళ్ళు” మూవీ నుంచి హీరో రామ్ కార్తీక్‌ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Published on Aug 2, 2021 2:00 pm IST

కుర్ర హీరో రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ నటీ,నటులుగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “తెలిసిన వాళ్లు”. అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా నిర్మిస్తుంది. అయితే దాదాపు చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా హీరో హీరో రామ్ కార్తీక్‌ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన హెబ్బా పటేల్ ఫస్ట్ లుక్‌కి చక్కటి ఆదరణ లభించిందని, ఇప్పుడు హీరో రామ్ కార్తీక్ లుక్ కూడా మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇకపై ప్రమోషన్స్‌పై దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ఇద్దరూ చాలా బాగా నటించారని, మిగిలిన వారి కూడా వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :