ఆ స్టార్ హీరో సినిమాకి తెలుగులో కూడా క్రేజ్ పెరిగిపోతోంది !
Published on Jul 20, 2017 6:09 pm IST


ఈ మధ్య తెలుగు మార్కెట్లో తమిళ సినిమాల హవా గతంతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే ఉంటున్నాయి. అందుకే అక్కడి పెద్ద హీరోలు, నిర్మాతలు తమిళంతో పాటే తెలుగులో కూడా సినిమాను డబ్ చేసి ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా స్టార్ హీరో అజిత్ కూడా తన ‘వివేగం’ ను ‘వివేకం’ పేరుతో తెలుగులోకి దింపుతున్నారు.

ఈ చిత్ర హక్కులు కూడా రూ. 4.5 కోట్ల భారీ ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇక ప్రమోషన్లలో భాగంగా నిన్న సాయంత్రం టీమ్ తెలుగు టీజర్ ను విడుదల చేసింది. ఆ టీజర్ భారీ యాక్షన్ సన్నివేశాలతో, డైలాగులతో, అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. దీంతో సినిమా పట్ల అందరిలోనూ మంచి ఆసక్తి నెలకొంది. మరి ఇంత వరకు తెలుగునాట సరైన విజయాన్ని అందుకోని అజిత్ ఈ సినిమాతో అయినా ఆ ఘనత సాదిస్తాడేమో చూడాలి. శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగష్టు 10న రిలీజ్ కానుంది.

టీజర్ కోసం క్లిక్ చేయండి:

 
Like us on Facebook