తెలుగులో “విక్రమ్” సాలిడ్ వసూళ్లు అనౌన్స్ చేసిన శ్రేష్ట్ మూవీస్.!

Published on Jun 7, 2022 8:00 am IST


లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ మల్టీ స్టారర్ చిత్రం “విక్రమ్” కోసం ఇప్పుడు ప్రేక్షకులు అంతా ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సాలిడ్ గా పుంజుకుంటూ వెళ్లడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది.

అయితే ఈ సినిమా వసూళ్ళకి సంబంధించి అయితే 3 రోజులపై డిస్ట్రిబ్యూటర్స్ శ్రేష్ట్ మూవీస్ వారు అధికారికంగా మూడు రోజుల వసూళ్లు అనౌన్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా గత మూడు రోజుల్లో 10 కోట్ల గ్రాస్ ని అందుకొని అదరగొట్టిందట. మొదటి రోజు డీసెంట్ గానే స్టార్ట్ అయ్యినా తర్వాత మాత్రం సాలిడ్ పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటికీ సింగిల్ స్క్రీన్స్ లో జనం క్యూ కడుతున్నారు. దీనితో ఈ సినిమా మన దగ్గర కూడా అదరగొడుతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్, సూర్య లు కీలక పాత్రల్లో నటించగా అనిరుద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :