ఏపీ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ ప్రత్యేక ధన్యవాదాలు..!

Published on Oct 14, 2021 9:00 pm IST


ఏపీలో నేటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు నడిపేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ఫిల్మ్ చాంబర్ హర్షం వ్యక్తం చేసింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేడు ప్ర‌త్యేక స‌మావేశ‌ం నిర్వహించగా ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ‌దాస్ నారంగ్, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్‌ తదితరులు ఏపీ సీఎం జ‌గ‌న్‌ మరియు మంత్రి పేర్ని నానికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ కష్టాలను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకొని వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయమని, ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఇండస్ట్రీ కష్టాలను తీర్చాలని, టిక్కెట్ రెట్లు, కరెంట్ బిల్లులు మొదలైన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం :