మెగాస్టార్ సినిమా కోసం సింగర్ గా మారిన తెలుగు స్టార్ హీరోయిన్ !


టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాశి ఖన్నా వరుస సినిమా ఆఫర్లతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ఛాన్సులను కూడా దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈమె బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘విలన్’ లో నెగెటివ్ షేడ్స్ కనిపించే పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ లో మాత్రమే కనిపించిన ఆమె ఇలా భిన్నమైన పాత్రలో కనిపిస్తుండటం ఒక విశేషమైతే సింగర్ గా మారడం మరో విశేషం.

అవును రాశి ఖన్నా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ కోసం గాయనిగా మారింది. ఇప్పటికే పాట రికార్డింగ్ కూడా పూర్తైపోయింది. ఈ విషయాన్నే తెలుపుతూ తన చిన్ననాటి కోరిక నెరవేరిందని, తమ మలయాళ డెబ్యూ సినిమా కోసం టైటిల్ సాంగ్ పాడానని అన్నారు. రాశి ఖన్నా గతంలో కూడా సందీప్ కిషన్ తో కలిసి నటించిన ‘జోరు’ సినిమా టైటిల్ సాంగ్ లో గొంతు కలిపింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘జై లవ కుశ’, రవితేజతో ‘టచ్ చేసి చూడు’ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది.